Pavanamainadi Song Lyrics :-

పావనమైనది ఈ గృహమూ …
సాయినామ సంకీర్తనతో … పరమ
1. అడుగడుగడుగో శ్రీసాయినాథుడు
అడుగడుగున మనల కాపాడు దేవుడు
అడిగిన వరమిడు షిరిడీపురరేడు
అడుగిడినాడు ఈ యింటనేడు
పావనమైనది ఈ గృహమూ …
సాయినామ సంకీర్తనతో … పరమ
2. ప్రవహిస్తోందిచట సాయి నామామృతమూ
అలరిస్తోందిచట సాయి సచ్చరితమూ
పరిమళిస్తోందిచట సంకీర్తనా కుసుమం
తాండవిస్తోందిచట సమతాభావం
పావనమైనది ఈ గృహమూ …
సాయినామ సంకీర్తనతో … పరమ
3. కనిపిస్తోందిచట సాయి సుందరరూపం
వినిపిస్తోందిచట ఓంకారనాదం
అనుభవించితిమిచట ఆత్మానందం
అనిపిస్తోందిచట మన జన్మధన్యం
పావనమైనది ఈ గృహమూ …
సాయినామ సంకీర్తనతో … పరమ
శ్రీ సచ్చిదానంద సద్గురూ సాయినాథ్ మహరాజ్కజై