Vinayaka Chavithi Special :-
Vinayakuni Pradhana || వినాయక / గణపతి ప్రార్థన
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!!
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం !
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే !!
ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం
సుందరం ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల
గండస్థలమ్ దంతాఘాత విదారితాం రుధిర్రె !
సింధూర శోభాకరం వందే శైలసుతాసుతం
గణపతిం సిద్ధిప్రదమ్ కామదమ్ !!
Vinayakuni Ashtothram || వినాయక / గణపతి అష్టోత్రం
పుష్పములు, పత్రి, అక్షతలు మొదలగు వానిచే ఒక్కొక్క నామము చదివి వినాయకుని పూజింపవలెను
1. ఓం గజాననాయ నమః
2. ఓం గణాధ్యక్షాయ నమః
3. ఓం విఘ్నరాజాయ నమః
4. ఓం వినాయకాయ నమః
5. ఓం ద్వైమాతురాయ నమః
6. ఓం ద్విముఖాయ నమః
7. ఓం ప్రముఖాయ నమః
8. ఓం సుముఖాయ నమః
9. ఓం కృతినే నమః
10. ఓం సుప్రదీపాయ నమః
11. ఓం సుఖనిధయే నమః
12. ఓం సురాధ్యక్షాయ నమః
13. ఓం మంగళస్వరూపాయ నమః
14. ఓం ప్రమదాయ నమః
15. ఓం ప్రథమాయ నమః
16. ఓం ప్రాజ్ఞాయ నమః
17. ఓం విఘ్నకర్తే నమః
18. ఓం విఘ్నహంత్రే నమః
19. ఓం విశ్వనేత్రే నమః
20. ఓం విరాట్పతయేనమః
21. ఓం శ్రీపతియే నమః
22. ఓం వాక్పతయే నమః
23. ఓం శృంగారిణే నమః
24. ఓం ఆశ్రిత వత్సలాయ నమః
25. ఓం మంత్రకృతే నమః
26. ఓం చామీకర ప్రభాయ నమః
27. ఓం సర్వాయ నమః
28. ఓం సర్వోపాస్యాయ నమః
29. ఓం సర్వకర్తే నమః
30. ఓం సర్వనేత్రే నమః
31. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః
32. ఓం సర్వసిద్ధయే నమః
33. ఓం పంచహస్తాయ నమః
34. ఓం పార్వతీనందనాయ నమః
35. ఓం ప్రభవే నమః
36. ఓం కుమారగురవే నమః
37. ఓం సురారిఘ్నాయ నమః
38. ఓం మహాగణపతయే నమః
39. ఓం శివప్రియాయ నమః
40. ఓం శీఘ్రకారిణే నమః
41. ఓం శాశ్వతాయ నమః
42. ఓం భవాయ నమః
43. ఓం బలోల్జితాయ నమః
44. ఓం భవాత్మజాయ నమః
45. ఓం పురాణపురుషాయ నమః
46. ఓం పూర్ణే నమః
47. ఓం మాన్యాయ నమః
48. ఓం మహాకాలాయ నమః
49. ఓం మహాబలాయ నమః
50. ఓం హేరంబాయ నమః
51. ఓం లంబజఠరాయ నమః
52. ఓం హ్రస్వగ్రీవాయ నమః
53. ఓం మహోదరాయ నమః
54. ఓం మదోత్కటాయనమః
55. ఓం మహావీరాయ నమః
56. ఓం మంత్రిణే నమః
57. ఓం విష్ణుప్రియాయ నమః
58. ఓం భక్తజీవితాయ నమః
59. ఓం జితమన్మథాయ నమః
60. ఓం ఐశ్వర్యకారణాయ నమః
61. ఓం జయి నే నమః
62. ఓం యక్షకిన్నర సేవితాయ నమః
63. ఓం గంగాసుతాయనమః
64. ఓం గణాధీశాయ నమః
65. ఓం గంభీరనినదాయ నమః
66. ఓం వటవే నమః
67. ఓం అభీష్టవరదాయ నమః
68. ఓం జ్యోతిషే నమః
69. ఓం మణికింకిణీ మేఖలాయ నమః
70. ఓం సమస్తదేవతామూర్తయే నమః
71. ఓం అక్షోభ్యాయ నమః
72. ఓం కుంజరాసురభంజనాయ నమః
73. ఓం ప్రమోదాయ నమః
74. ఓం మోదక ప్రియాయనమః
75. ఓం కాంతిమ తే నమః
76. ఓం ధృతిమతే నమః
77. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
78. ఓం అగ్రగణ్యాయ నమః
79. ఓం అగ్రపూజ్యాయ నమః
80. ఓం అగ్రగామినే నమః
81. ఓం భక్తనిధయే నమః
82. ఓం భావగమ్యాయ నమః
83. ఓం జిష్ణవే నమః
84. ఓం సహిష్ణవే నమః
85. ఓం సతతోత్థతాయ నమః
86. ఓం విఘాతకారిణే నమః
87. ఓం విశ్వదృశే నమః
88. ఓం విశ్వరక్షాకృతే నమః
89. ఓం కళ్యాణగురవే నమః
90. ఓం ఉన్మత్తవేషాయ నమః
91. ఓం సర్వైశ్వర్య ప్రదాయకాయ నమః
92. ఓం అక్రాస్తచిదచిత్ప్రభవే నమః
93. ఓం కామినే నమః
94. ఓం కపిత్థపనసప్రియాయ నమః
95. ఓం బ్రహ్మచారిణే నమః
96. ఓం బ్రహ్మరూపిణే నమః
97. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
98. ఓం మంగళ ప్రదాయ నమః
99. ఓం అవ్యక్తాయ నమః
100. ఓం అపాకృతపరాక్రమాయ నమః
101. ఓం సత్యధర్మిణే నమః
102. ఓం సఖ్యై నమః
103. ఓం సరసాంబునిధయే నమః
104. ఓం మహేశాయ నమః
105. ఓం దివ్యాంగాయ నమః
106. ఓం పరజితే నమః
107. ఓం సమస్తజగదాధారాయ నమః
108. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
ఓం అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
Vinayakuni Pathra Pooja || వినాయక / గణపతి పత్ర పూజ

(వినాయకుని 21 రకముల పత్రములు – ఆకులచే పూజింపవలెను)
సంస్కృతపదము పక్కనే ఆ పత్రము యొక్క తెలుగు పేరు కూడా యివ్వడమైనది. కొన్ని రకముల పత్రములు లభింపక పోయినచో ఆ సందర్భమున వేరొక పత్రము వాడవచ్చును. ఇందులో కొన్ని పత్రములు సాధారణముగా పూజకు వాడనివి. కాని వినాయక చవితిరోజున అవి వాడుటకు అనుమతింపబడియున్నవి.
1. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి (మాచిపత్రి)
2. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి (వాకుడు)
3. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి (మారేడు)
4. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి (2 గరికలు)
5. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త)
6. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి (రేగు)
7. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి (ఉత్తరేణి)
8. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి (తులసి)
9. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి (మామిడి)
10. ఓం వికటాయ నమః కరవీపత్రం సమర్పయామి (గన్నేరు)
11. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి (విష్ణుకాంత)
12. ఓం వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ)
13. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి (దేవదారు)
14. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి (మరువం)
15. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి (వావిలి)
16. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి (జాజి)
17. ఓం సురాగ్రజాయ నమః గండకిపత్రం సమర్పయామి (ఏనుగుచెవి ఆకు)
18. ఓం ఇభవక్రాయ నమః శమీపత్రం సమర్పయామి (జమ్మి)
19. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి (రావి)
20. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి (మద్ది)
21. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి (జిల్లేడు)
Vinayakuni Jannam || వినాయక / గణపతి జననం
కైలాసంబున పార్వతి భర్తరాకను దేవతాదులవలన విని ముదమంది అభ్యంగ స్నానమాచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో నొక బాలునిచేసి, బ్రాణంబొసంగి, వాకిలిద్వారమున కాపుంచె, స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొని పతి ఆగమనమునకు నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి, లోపలికి పోబోవ ద్వారమందున్న బాలకుడడ్డగింప కోపావేశుడై త్రిశూలముచే నా బాలకుని కంఠంబు దునిమి లోనికోగె.
పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు పూజించె, వారిరువురును ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంత మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును నాబాలుని కతికించి ప్రాణంబొసంగి గజాననుండని నామంబొసంగె అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కితిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను వాహనముగా చేసికొనెను. కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జన్మించె. ఇతడు మహాబలశాలి, ఇతని వాహనము నెమలి, ఇతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతి గాంచియుండెను.
Vinayakuni Katha || వినాయక / గణపతి కథా ప్రారంభం
సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్ర దర్శన దోషకారణంబును, తన్ని వారణంబును చెప్పదొడంగెను.
పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోరతపం బొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు గోరుమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి స్వామీ ! నీవు ఎల్లప్పుడు నా యుదరమందే వసించియుండుమని కోరెను. భక్త సులభుడగు నా మహేశ్వరుండాతని కోర్కె దీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుండె.
కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుండగుట దెలిసి రప్పించుకొను మార్గంబుగానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం దెల్పె. ఓ మహానుభావా ! పూర్వం భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నా కొసగితివి. ఇపుడు గూడ నుపాయాంతరముచే రక్షింపుమని విలపింప, హరి యా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు, గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాదిదేవతలచే తలకొక వాయిద్యమును ధరింపచేసి, తానును చిరుగంటలు, సన్నాయిని దాల్చి గజాసుర పురంబు జొచ్చి, జగన్మోహనంబుగా నాడించుచుండ, గజాసురుడు విని వారల పిలిపించి తన భవనము యెదుట నాడించ నియమించెను. బ్రహ్మాది దేవతల వాద్యవిశేషంబులు జోరోగొల్ప జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్రవిత్రముగా గంగిరెద్దునాడించగా గజాసురుడు పరమానంద భరితుడై “మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చెగాన శివునొసంగు”మని పల్కె ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని “నాశిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మమును నీవు ధరింపవె” యని ప్రార్థించి, విష్ణుమూర్తికి అంగీకారము దెలుప, హరి నందిని ప్రేరేపింప నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండు గజాసురగర్భమునుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించె. అంత నాహరి “దుష్టాత్ముల కిట్టివరంబు లీయరాదు, యిచ్చినచో పామునకు పాలుపోసినట్లగు”నని, యుపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కొలిపి తానును వైకుంఠమున కరిగె. శివుండు నందినెక్కి కైలాసంబున కతివేగమున జనియె.
Vinayakuni Adipthyam || వినాయక / గణపతి ఆధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించి, విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగమనిరి, గజాననుడు మరగుజ్జువాడు, అసమర్ధుడు గాన ఆయాధిపత్యంబు తన కొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనెను. “మీలో నెవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో వారికా యాధిపత్యం బొసంగుదునని మహేశ్వరుడు పలుక, సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబెక్కి వాయువేగంబున నేగె, గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా ! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయ తగునే ! మీ పాదసేవకుండనగు నాయందు కటాక్షముచి తగు నుపాయంబు దెల్పి రక్షింపవే. యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృన్నారాయణేత్యుక్త్వాపుమాన్ కల్పశతత్రయం | గంగాది సర్వతీర్దేషు స్నాతోభవతి పుత్రక” కుమారా ! ఒక్కసారి నారాయణ మంత్రము జపించిన మాత్రమున మూడు వందల కల్పములు పుణ్య నదులలో స్నామొనర్చిన వాడగునని సక్రమంబుగ నారాయణ మంత్రం నుపదేశింప గజాననుడు అత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబుననుండె.
అమ్మంత్ర ప్రభావంబున అంతకుపూర్వము గంగానదికి స్నానమాడ నేడిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి నటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసమునకేగి తండ్రి సమీపమందున్న గజాసురునిగాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, తండ్రీ ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని క్షమించుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు” డని ప్రార్ధించె. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామము సేయబోవ కడు శ్రమనొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగా నవ్వె, అంత “రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు” నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లెడలం దొర్లెను. అతండును మృతుండయ్యెను. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, “పాపాత్ముడా ! నీ దృష్టి తగిలి నాకుమారుడు మరణించెను గాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక !” యని శపించెను…