Gopala Song Lyrics in Telugu :-
గోపాల రావేలా – దర్శన మీయ వదేలా
నీ దర్మన మయ వదేలా
గోపాల రావేలా – దర్శన మీయ వదేలా
నీ దర్మన మయ వదేలా
1. సొగసులు చిలికే – నీ చిరు నవ్వులు
నిగ నిగలాడే – రతనాల జల్లులు
మోహన రూపా – యదుకుల దీపా
మధుర సుధారస కేళి కలాపా
గోపాల రావేలా – దర్శన మీయ వదేలా
నీ దర్మన మయ వదేలా
2. నీమృధు మోహన మురళీ రవళికి
అఖిల జగాలు నిత్య నివాళి
బృందావనిలో నవరస కేళి
భక్తుల పాలిట దీపావళీ
గోపాల రావేలా – దర్శన మీయ వదేలా
నీ దర్మన మయ వదేలా
3. షుళ్లు షుళ్లు షుళ్లు గజ్జెలు మ్రోగగా
గంతులు వేయుచు – చెంతకు రారా
వెదకి వెదకి వేసారితి విఠలా
సరగున దరిశన మీయ వదేలా
గోపాల రావేలా – దర్శన మీయ వదేలా
నీ దర్మన మయ వదేలా
హేకృష్ణా, ముకుందా, మురారీ
గోపాల రావేలా – దర్శన మీయ వదేలా
నీ దర్మన మయ వదేలా