Om Song Lyrics in Telugu :-

ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
1. శ్రీ శైలములో వెలసితివా
హరహర శంభో మహాదేవా
ఇలలో వేరే దైవము లేడని
ఇలలో వేరే దైవము లేడని
నమ్మిలిమి మము మరువకురా
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
2. కంఠము నందు గరళము నింపి
జగములనేలే జగదీశా
పూజలు చేసే సమయ మిదేనని
పూజలు చేసే సమయ మిదేనని
పిలసితిమి మామొర వినరా
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా