Govinda Mamida Song Lyrics in Telugu :-
గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా
మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా
గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా
మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా
1. నీ మనసే చల్లనిది – జగమంతా నిండినది
నారాయణ నీనామం – గానముగా మారినది
గోవిందా యని పిలచితిని – నీపద సన్నిది నిలచిలిని
గోకుల బాలా మా పై నీదు కరుణ చూపరావా
గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా
మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా
2. నీ సన్నిది నిలుచుటకు – కొందరికే దొరికేది
మాభాగ్యం ఈనాడు – నీ సేవే దొరికినది
గోవిందా యని పిలచితిమి – నీ భజనలు చేయుచు
పిలచితిమి
భజనలు చేసే భక్తులపైన – కరుణ చూపరాదా
గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా
మా మొరలే వినలేవా నీ కరుణ చూపరావా