Sri Guru Chalisa in Telugu :-
శ్రీ గురు చాలీసా
1. అత్యనసూయల దత్తుడివి సుమతీ శర్మల పుత్రుడివి మము బ్రోచే శ్రీపాదుడిని దివి నుండి భువి వచ్చితివి.
2. సోదరులను పిలిపించితివి అవిటి తనమును బాపితివి తల్లి బాధను తీర్చితివి ఆనందమును పంచితివి.
3. రజకుని సేవలు మెచ్చితివి రాజుగ వరమును యిచ్చితివి ఆతని కోర్కెను తీర్చితివి నీ మహిమలను చూపితివి.
4. కురువపురమును చెరితివి అవతారము చాలించితివి వల్లభేశుని బ్రతికించి అదృశ్యముగ నించితివి.
5. వృసింహ సరస్వతి అవతారం అంబకు కలిగెను ఆనందం చిత్రమయా నీ జననం పుట్టిన వెంటనే ఓంకారం.
6. విద్యలు నేర్చే ప్రాయమున వేదాలే నీవు వేర్చితివి మానవ ధర్మం తెలిపితివి సన్యాసినిగా మారితివి.
7. ఉదర రోగమును పోగొట్టి విప్రుడినీ రక్షించితివి తీర్ధ యాత్రలు చేసితివి వాటి మహిమను తెలిపితివి.
8. కలలో రాజును శిక్షించి సాయ౦దేవుని బ్రతికించి దివ్య లీలనే చేసితివి శిష్య కోటిలో చేర్చితివి.
9. గురువు త్రిమూర్తి రూపమనీ భక్తితో సేవలు చేయుమనీ ధౌమ్యుని చరితము చెప్పితివి గురుభక్తిని యిల చాటితివి.
10. పేద బ్రాహ్మణుని కరుణించి తమ్మ పాదును తొలగించి నిండుగ నిధులే యిచ్చితిని దైన్యము దూరము చేసిలేవి.
11. గంగానుజుని దీవించి త్రిస్థలి యాత్రా చేయించి క్షేత్ర మహిమను వివరించి సిరి సంపదలను యిచ్చితివి.
12. పిశాచ భయము వదలించి శాంతాదేవిని రక్షించి పుత్రశోకము తేర్చితివి ఇద్దరు బిడ్డలనొసగితిని.
13. త్రివిక్రముని పరీక్షించి అందరిలోను కనిపించి అజ్ఞానమును తొలగించి నిజ రూపమును చూపితివి.
14. మాతంగుడిని పిలిపించి వేద పండితుల నోడించి వారి గర్వమును అణచితివి భన్మ మహిమను చూపితివి.
15. సావిత్రి భక్తిని మెచ్చితివి పతి ప్రాణములను యిచ్చితివి బ్రహ్మ వ్రాతనే మార్చితివి అతని ఆయువు పెంచితిని.
16. రుద్రాక్ష మహిమ చూపితివి వ్రత మహాత్మ్యము తెలిపితివి పరాన్న సుఖము వలదు అవీ బ్రాహ్మణ స్త్రీకి చెప్పితివి.
17. భాస్కరశర్మను దీవించి సోలెడు బియ్యము వండించి అక్షయ పాత్రగ మార్చితివి సంతర్పణ చేయించితివి.
18. గంగను నీవు ఓదార్చి సంతానమును యిచ్చితివి సర్వ దేవతా నిలయమని అశ్వత్థ మహిమను తెలిసితివి.
19. ఎండు కట్టెను యిచ్చితివి దానికి ప్రాణం పోసితివి నరహరి రోగము బాపితివి గురు కృపను చూపితివి.
20. పెను తుపానును సృష్టించి మరముకు నీవు పంపితివి గురు సేవలు బహు కఠినమని సాయందేవుతో పలికితివి.
21. తంతుడి భక్తిని గమనించి లింగ రూపమున కనిపించి అన్ని పూజలూ గ్రహియించి శ్రీశైలమును చూపితివి.
22. నిన్నే శరణం వేడుమనీ దేవీ పంపిన నందుడికీ కుష్ఠు రోగము మన్పితివి అతడి సంశయము తీర్చితివి.
23. అందరి పిలుపును మన్నించి అష్ట రూపములు ధరియించి ఏక కాలమున కనిపించి దైవ శక్తిని చాటితివి.
24. పర్యలేశుని కరుణించి పైరును మొత్తము కోయించి అధిక దిగుబడి యిచ్చితివి అతడి భక్తిని మెచ్చితివి.
25. సాధు దర్శనం శ్రేష్ఠమని యవనరాజుకు తెలిపితివి శ్రీపాదునిగా అగుపించి రాచ పుండును బోసితివి.
26. అష్టతీర్ధములు చూపించి వాటి మహిమను వివరించి కరుణామృతమే కురిపించి భక్తుల బాధలు తీర్చితివి.
27. పాదుకలూ పూజించుమని సంకీర్తనమే చేయుమనీ సర్వ శుభములు కలుగునని కదళీవనముకు తరలితివి.
28. శ్రీగురుమూర్తి దయామయా కరుణించి కాపాడుమయా సర్వ వ్యాప్తిని నీవయ్యా సద్గతి మాకు చూపుమయా.
దిగంబరా… దిగంబరా…
శ్రీపాధ వల్లభ… దిగంబరా…