Abhisekam Song Lyrics :-
అభిషేకం చేదము రారండీ
శ్రీ శిరిడీ సాయికి
అభిషేకం చేదము రారండీ
శ్రీ సద్గురు సాయికి
1. పవిత్రమైన గంగాజలముతో
పవిత్రమైన ఆవుపాలతో
పవిత్రమైన ఆవు పెరుగుతో
మధుర మధుర తరమంగళమూర్తికి
అభిషేకం చేదము రారండీ
శ్రీ శిరిడీ సాయికి
2. పవిత్రమైన ఆవు నెయ్యితో
పవిత్రమైన పట్టుతేనెతో
పవిత్రమైన కొబ్బరి నీళ్ళతో
మృదుల మృదుల తర మోహన మూర్తికి
అభిషేకం చేదము రారండీ
శ్రీ శిరిడీ సాయికి
3. పవిత్రమైన అరటి పండ్లతో
పవిత్రమైన చెరకురసముతో
పవిత్రమైన ఫలరసములతో
సురుచిర సుందర చిన్మయమూర్తికి
అభిషేకం చేదము రారండీ
శ్రీ శిరిడీ సాయికి
4. పవిత్రమైన మంచిగంధముతో
పవిత్రమైన విభూతితో
పవిత్రమైన పన్నీటితో
ధర్మమూర్తి శ్రీ ద్వారకమాయికి
అభిషేకం చేదము రారండీ
శ్రీ శిరిడీ సాయికి
5. భక్తిశ్రద్ధలతో నామము పలుకుచు
తన్మయత్వముతొ జైజైయనుచు
అందరికీ అవకాశమిచ్చుచూ …
దాసకోటి హృత్కమల నివాసికి
అభిషేకం చేదము రారండీ
శ్రీ శిరిడీ సాయికి
అభిషేకం … అభిషేకం … ఇది పంచామృత అభిషేకం …
అభిషేకం …. అభిషేకం …. ఇదియే మానస అభిషేకం …