Adugo Song Lyrics in Telugu :-

అడుగో అడుగో రాముడు – అతడే మేఘశ్యాముడు
అతడే మంగళ దాయుడు – అతడే కోదండ రాముడు స్వామి
అడుగో అడుగో రాముడు – అతడే మేఘశ్యాముడు
అతడే మంగళ దాయుడు – అతడే కోదండ రాముడు స్వామి
1. పీతాంబరములు చూడండి
తాపత్రయములు మరువండి
పాదంబులను పట్టండి
పరమాత్ముని పరికించండి
అడుగో అడుగో రాముడు – అతడే మేఘశ్యాముడు
అతడే మంగళ దాయుడు – అతడే కోదండ రాముడు స్వామి
2. వక్షమున వన మాలలతో
ప్రక్కన సీతా దేవితో
కస్తూరి తిలకంబులతో
కమల నాధుని చూడండి
అడుగో అడుగో రాముడు – అతడే మేఘశ్యాముడు
అతడే మంగళ దాయుడు – అతడే కోదండ రాముడు స్వామి
3. శిరమున రత్న కిరీటముతో
కరమున శంఖ చక్రముతో
అభయ మిచ్చెడి హస్తముతో
ఆనంద మూర్తిని చూడండి
అడుగో అడుగో రాముడు – అతడే మేఘశ్యాముడు
అతడే మంగళ దాయుడు – అతడే కోదండ రాముడు స్వామి
4. తమ్ములు సేవలు చేయగను
తత్వములు భోధించగను
హర్షయలతో హనుమంతుడు
ఆనందములో మునిగాడు
అడుగో అడుగో రాముడు – అతడే మేఘశ్యాముడు
అతడే మంగళ దాయుడు – అతడే కోదండ రాముడు స్వామి