Dasharadha Song Lyrics | దశరధ తనయా పాట – Rama Song

Dasharadha Song Lyrics in Telugu :-

Dasharadha Song Lyrics

దశరధ తనయా రావయ్యా
వేళాయనురా పూజలకు సేవలకు – పూజలకూ రామా
ఆ… ఆ… ఆ…

దశరధ తనయా రావయ్యా
వేళాయనురా పూజలకు సేవలకు – పూజలకూ రామా
ఆ… ఆ… ఆ…

1. పూసెను మల్లెలు నీ కొరకై
విరిసెను జాజులు నీ కొరకై
కోసితిని బుట్టేడు పూవులు నీ కై
కోసితిని బుట్టేడు పూవులు నీ కై
వేగమే గైకొని రావయ్యా

దశరధ తనయా రావయ్యా
వేళాయనురా పూజలకు సేవలకు – పూజలకూ రామా
ఆ… ఆ… ఆ…

2. వెంగిలి పండ్లను తిన్నావూ
శబరికి మోక్షము నిచ్చావూ
ఏలామాపై దయగన రావా
ఏలామాపై దయగన రావా
మోదము గూర్పగ రావయ్యా

దశరధ తనయా రావయ్యా
వేళాయనురా పూజలకు సేవలకు – పూజలకూ రామా
ఆ… ఆ… ఆ…

3. వాడెను మల్లెలు కుసుమాలు
కన్నులు నిండెను బాష్పాలు
జ్యోతులు ఎంతో నిరాశ చెంది
జ్యోతులు ఎంతో నిరాశ చెంది
కృంగు చు నుండెను రావయ్యా

దశరధ తనయా రావయ్యా
వేళాయనురా పూజలకు సేవలకు – పూజలకూ రామా
ఆ… ఆ… ఆ…

4. తల్లియు తండ్రియు నీవేరా
పతియు గతియు నీవేరా
అరమర సేయగ వేగమె బ్రోవా
అరమర సేయగ వేగమె బ్రోవా
సుందర వదనా రావయ్యా

దశరధ తనయా రావయ్యా
వేళాయనురా పూజలకు సేవలకు – పూజలకూ రామా
ఆ… ఆ… ఆ…

Leave a Comment