Durgamma Song Lyrics in Telugu :-

బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లీ
చేసేము నీ పూజ ఓ కల్పవల్లీ
కనికరించాలి మమ్ముల కాచుకోవాలి
ఓ తల్లి కనికరించాలి మమ్ముల కాచుకోవాలి
1. అమ్మలకే అమ్మ వన్నాములే
నీ కొండకు మే చేరు కొన్నాములే
దండ మన్నాలే దారి చూపించాలి
అండ దండ మాకు నీ వేలే నీవేలే
బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లీ
చేసేము నీ పూజ ఓ కల్పవల్లీ
కనికరించాలి మమ్ముల కాచుకోవాలి
ఓ తల్లి కనికరించాలి మమ్ముల కాచుకోవాలి
2. కృష్ణవేణి పొంగుతుందంట
నీముక్కు ముంగెర తాకుతుందంట
తప్పదంట వీర బ్రహ్మ వాక్కంట
కనిపెట్టి మమ్మేలు ఓ కంట… ఓ కంట
బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లీ
చేసేము నీ పూజ ఓ కల్పవల్లీ
కనికరించాలి మమ్ముల కాచుకోవాలి
ఓ తల్లి కనికరించాలి మమ్ముల కాచుకోవాలి
3. కలలో నైనా అలివేణి
నే మరువను నిన్ను శివరాణి
చక్కనమ్మా మా దిక్కు నీవేనమ్మా
మ్రొక్కెనమ్మా ఇంద్రాణి… ఇంద్రాణి…
బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లీ
చేసేము నీ పూజ ఓ కల్పవల్లీ
కనికరించాలి మమ్ముల కాచుకోవాలి
ఓ తల్లి కనికరించాలి మమ్ముల కాచుకోవాలి