Ela Radamma Song Lyrics | ఏల రాడమ్మా పాట

Ela Radamma Song Lyrics in Telugu :-

ఏల రాడమ్మా ఇంతిరో
వాడేల రాడమ్మా నన్నేలిను వాడు

ఏల రాడమ్మా ఇంతిరో
వాడేల రాడమ్మా నన్నేలిను వాడు

1. పచ్చని పులుగుల బండి మీదనుండు
పచ్చ వింటి పిన్న బాలుని తండ్రి
పచ్చని చాయల బాయని బంగారు
పచ్చడము గట్టిన బాగైన వాడు

ఏల రాడమ్మా ఇంతిరో
వాడేల రాడమ్మా నన్నేలిను వాడు

2. తెల్లని పులుగుపై దిరుగ మరిగి నట్టి
తెల్లని సతిపాలి దేవర తండ్రి
తెల్లని పరుపు పై దేలి పొరలు పెట్టు
తెల్లని కన్నుల తెలివైన వాడు

ఏల రాడమ్మా ఇంతిరో
వాడేల రాడమ్మా నన్నేలిను వాడు

3. కొండ వీటి వాని సత్తి కొనిన యట్టి
కొండక పాయపు గూతురు తండ్రి
కొండల రాయడు కొనేటి తిమ్మయ్య
కొండతల నెత్తిసరు ఎతైన వాడు

ఏల రాడమ్మా ఇంతిరో
వాడేల రాడమ్మా నన్నేలిను వాడు

Leave a Comment