Jagadapu Song Lyrics in Telugu :-

జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర
1. మొల్లలు తురుములు ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ బతిపై
చల్లే రతివలు జాజర
జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర
2. భారపు కుచముల పైపై కడు
సింగారపు నెరపెడి గంధ వొడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు జల్లేరు జాజర
జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర
3. బింకపు కూటమి పెనగటి చెమటల
పంతపు పూతల పరిమళము
వేంకట పలివై వెలదులు నించేరు
సరి కుమదంబుల జాజర
జగడపు చనువుల జాజర – సగినల మంచపు జాజర