Kailasa Giri Song Lyrics in Telugu :-
కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా
కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా
1. శిరముండు గంగా – మురమందు ఉరగమునూ
ధరించిన ఓ దేవా – ఓ దేవా
శరణన్న సురలను – కరుణించి బ్రోవగ
గరళమునె గైకొన – గౌరి వరా
కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా
2. ముక్కంటి నీవే – దిక్కంటి నయ్యా
చిక్కులను బాపుమయ్యా – సాంబయ్య
కన్నప్ప నీకు కనులప్పగించగ
దయ చూపి దరిశనము నిచ్చావుగా
కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా
3. ఓ పార్వతీశా – మాపాలి దేవా
కాపాడగా రావా – ఓ దేవా
నీపాదములనే నెర నమ్మితినిరా
మా పాపములు బాపి దరిచేర్చవా
కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా