Karuna Chupavamma Song Lyrics in Telugu :-
కరుణ చూపవమ్మ దరి చేరి బ్రోవవమ్మా
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి
1. కామాక్షి దేవి రావే
మా కన్నతల్లి నీవే… ఆ… ఆ… ఆ…
నీఘన మహిమ లెన్నగ వశమా
దాస జనుల బ్రోవవమ్మా
కరుణ చూపవమ్మ దరి చేరి బ్రోవవమ్మా
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి
2. ఓ పాపహారిణి రావే
మా పాలి దిక్కు నీవే… ఆ… ఆ… ఆ…
నీ పద సేవ చేసిన వారికి
జన్మ పావనము లే
కరుణ చూపవమ్మ దరి చేరి బ్రోవవమ్మా
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి
3. ఆశించినాము తల్లి
నీ ప్రేమ కల్పవల్లి ఆ… ఆ… ఆ…
ఆశ్రిత వల్లి మది విలసిల్లి
వేగబ్రోవ మళ్లీ
కరుణ చూపవమ్మ దరి చేరి బ్రోవవమ్మా
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి
జాగేలనమ్మా శ్రీ కళ్యాణి