Lakshmi Devi Song Lyrics :-
శ్రీలక్ష్మీదేవీ … మా పూజలు గైకొనుమా …
1. క్షీర సాగరమందు జన్మించితి ఓయమ్మా
శ్రీహరి హృదయాబ్జమున నెలకొంటివి మాయమ్మా
సిరివై యీ విశ్వమున విలసిల్లితివమ్మా
శ్రీలక్ష్మీదేవీ … మా పూజలు గైకొనుమా …
2. ఆదినారాయణుని అర్ధాంగీ రావమ్మా
ఆదిలక్ష్మీ మాపై ఆదరణ చూపమ్మా
నీ దివ్య పదములనె మది నమ్మితిమమ్మా
శ్రీలక్ష్మీదేవీ … మా పూజలు గైకొనుమా …
3. అష్టలక్ష్మిగా నీవు అలరారు చుంటివమ్మా
నిష్ఠతొ నిను కొలిచేటి అదృష్టమె మాదమ్మా
కష్టములు కడతేర్చు కనక మహాలక్ష్మీ
శ్రీలక్ష్మీదేవీ … మా పూజలు గైకొనుమా …
4. దాసకోటిని బ్రోచే ధనలక్ష్మివి నీవమ్మా
దారిద్ర్యము బాపేటి ధాన్యలక్ష్మివి నీవమ్మా
దయగనుమ మొరవినుమ దర్శన మీయమ్మా
శ్రీలక్ష్మీదేవీ … మా పూజలు గైకొనుమా …
జై ధనలక్ష్మి జై జై వరలక్ష్మి జై
జై ధనలక్ష్మి జై జై వరలక్ష్మి జై