Mallelu Malalatho Song Lyrics in Telugu:-
మల్లెలు మాలలతో, జాజి, విరజాజులతో
జగదేక మాతను కొలచి జయ హారతులివరే
జే జేలు పాడరే జే జేలు పాడరే
మల్లెలు మాలలతో, జాజి, విరజాజులతో
జగదేక మాతను కొలచి జయ హారతులివరే
జే జేలు పాడరే జే జేలు పాడరే
1. కుందనాల లక్ష్మికి, కుంకుమాలు దిద్ద రే
పగడాల దుర్గాదేవికి పసుపు అద్దరే
కళ్యాణ గౌరీ దేవికి గందాలు పూయరే
గాజులు వేయరే గాజులు వేయరే
మల్లెలు మాలలతో, జాజి, విరజాజులతో
జగదేక మాతను కొలచి జయ హారతులివరే
జే జేలు పాడరే జే జేలు పాడరే
2. మనసైన మహాలక్ష్మికి మందార మాలలు
చల్లపైన సరస్వతమ్మకు చామంతి మాలలు
సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు
తులసీ దళ మాలలు, తులసీ దళ మాలలు
మల్లెలు మాలలతో, జాజి, విరజాజులతో
జగదేక మాతను కొలచి జయ హారతులివరే
జే జేలు పాడరే జే జేలు పాడరే
3. ఓంకార లలితా దేవికి ఒడి బియ్యం పోయిరే
నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే
అనురాగాల అన్నపూర్ణమ్మకు హారతులీ వరే
మంగళ హారతులీ వరే
మల్లెలు మాలలతో, జాజి, విరజాజులతో
జగదేక మాతను కొలచి జయ హారతులివరే
జే జేలు పాడరే జే జేలు పాడరే