Mutyalamutakanna Song Lyrics | ముత్యాలమూటకన్న పాట – Sai Song

Mutyalamutakanna Song Lyrics :-

Mutyalamutakanna Song Lyrics

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

1. పాలూ మీగడలకన్న పంచదారతేనె కన్న
ఎంతోరుచియైనదీ సాయి నామమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

2. రామచిలుకపలుకుకన్న కోకిలమ్మ పాటకన్న
ఎంతో యింపైనదీ సాయి నామమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

3. సన్నజాజి మాలకన్న సంపంగి పూలకన్న
ఎంతో పరిమళమైనది సాయినామమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

4. సప్తస్వరాలకన్న సప్తతాళాలకన్న
ఎంతో సొగసైనదీ సాయినామమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

5. కదళీ ఖర్జూరకన్న దానిమ్మద్రాక్షకన్న
ఎంతో రుచియైనదీ సాయినామమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

6. మామిడి ఫలరసముకన్న పెరుగూపాయసము కన్న
ఎంతో రుచియైనదీ సాయినామమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

7. ఏకాదశి అయిననేమి అమావాస్య అయిననేమి
సాయిని భజియించుదినమె చక్కని దినమూ

ముత్యాలమూటకన్న రత్నాలరాశికన్న
ఎంతో విలువైనదీ సాయి నామమూ

సాయిరామ గోవింద నారాయణా
సాయికృష్ణ గోవింద నారాయణా
నారాయణా హరినారాయణా
నారాయణా సాయినారాయణా

Leave a Comment