Nama Mahima Song Lyrics :-
నామ మహిమా తెలియగ రారండి
శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగ రారండి
నామ మహిమా తెలియగ రారండి
శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగ రారండి
1. అకాల మృత్యువు అసలేరాదట అసలేరాదట
సకాల మృత్యువు సవ్యంబనట సవ్యంబనట
అకాల జ్ఞాన త్రిగుణాతీతం…అ అ అ ఆ
త్రిపురసుందరిని తలసిన కలుగును
నామ మహిమా తెలియగ రారండి
శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగ రారండి
2. సర్వరోగములు శమింపజేసీ శమింపజేసీ
సర్వసంపదలు సమకూర్చునది కూర్చునది
సహస్రనామ పారాయణలకు…అ అ అ ఆ
శ్రీ చక్రాంకిత వాసిని తెలిపిన
నామ మహిమా తెలియగ రారండి
శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగ రారండి
3. కోటి జన్మములు గంగను మునిగిన గంగను మునిగిన
కోటి దానములు కోరి చేసినా కోరి చేసినా
కోటి లింగములు ప్రతిష్టించినా…అ అ అ ఆ
సహస్రనామమునకు సాటి రావట
నామ మహిమా తెలియగ రారండి
శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగ రారండి