Namaste Song Lyrics in Telugu :-
నమస్తే గరుడారుడే కోలా సరభరపరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
1. వారములలో శుభవారము శుక్రవారం
శుభతారక మైనది శుక్రవారం
శ్రీవారి హృదమేశ్వరిని తలచే వారం
శ్రీమహాలక్ష్మిని కొలిచే శుభవారం
నమస్తే గరుడారుడే కోలా సరభరపరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
2. తొలిసంధ్యా రవికిరణం నిలిచే వేళ
మంగళ కరనాధమే పలికేటి వేళ
మనసులలో భక్తి విరులు విరిచే వేళ
మహాలక్ష్మి పూజతే సలిపే శుభవారం
నమస్తే గరుడారుడే కోలా సరభరపరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
3. కలువ బాల నిద్దురలో మునిగేటి వేళ
వెలుగు రేఖ చీకటులను తరిమే వేళ
కలతంతుపు గళమెత్తి పలికే వేళ
మహాలక్ష్మి మా పూజలు అందుకొనే వారం
నమస్తే గరుడారుడే కోలా సరభరపరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
4. కర్మసాక్షి కలలు మరచి లేచేటి వేళ
సుప్రభాత సుమరేఖలు కురిచే వేళ
కర్పూరపు హారతి వేలిగే వేళ
లోక జనని పాదములే కొలిచే వారం
నమస్తే గరుడారుడే కోలా సరభరపరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే