Nammiti Ni Song Lyrics :-
నమ్మితి నీ మనసంబున – నీవె దైవమని నెరనమ్మితి నీపాద పద్మములనూ
నాదు బాధ తీర్చ నీవే దిక్కునుచు నీకు మ్రొక్కెద సాయినాధా
1. నీవేమో దివి పైనా మరి మేమేమో భువిపైనా బాబా
మమ్ము పాల ముంచినా – మమ్ము నీట ముంచినా నిను మేము మరి చేమా
జై బాబా, మా బాబా – జై సాయి, మా సాయి
నమ్మితి నీ మనసంబున – నీవె దైవమని నెరనమ్మితి నీపాద పద్మములనూ
నాదు బాధ తీర్చ నీవే దిక్కునుచు నీకు మ్రొక్కెద సాయినాధా
2. ముత్యాల దండను కాను నీ మెడలో న హార మవ్వ లేను బాబా
రతనాల గొడుగును కాను – నీతలపైన చాయనివ్వ లేను బాబా
మమ్ము పాల ముంచినా – మమ్ము నీట ముంచినా నిను మేము మరి చేమా
జై బాబా, మా బాబా – జై సాయి, మా సాయి
నమ్మితి నీ మనసంబున – నీవె దైవమని నెరనమ్మితి నీపాద పద్మములనూ
నాదు బాధ తీర్చ నీవే దిక్కునుచు నీకు మ్రొక్కెద సాయినాధా
3. నీ సన్నిధీ చేరినాము, మరి నీ సేవ లే చేసినాము బాబా
ఈ దాసులను బ్రోవరావా – మరి మాపైన కరుణ చూపితీవా బాబా
పాల ముంచినా – మమ్ము నీట ముంచినా నిమ మేము మరి చేమా
జై బాబా, మా బాబా – జై సాయి, మా సాయి
నమ్మితి నీ మనసంబున – నీవె దైవమని నెరనమ్మితి నీపాద పద్మములనూ
నాదు బాధ తీర్చ నీవే దిక్కునుచు నీకు మ్రొక్కెద సాయినాధా
ఓం సాయి, శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి, శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి, శ్రీ సాయి జయజయ సాయి