Ni Kondaku Song Lyrics in Telugu :-
నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మ్రొక్కులు
మాచే ఇప్పించుకో
నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మ్రొక్కులు
మాచే ఇప్పించుకో
1. కొండంత సంసారం మోయలేని మానవులం
కొండంత సంసారం మోయలేని మానవులం
ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము
సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బరులం
స్వర్గానికి నిచ్చెనలు వేయలేము
నీకొండకు నీవే రప్పించుకో ఆపద మ్రొక్కులు
మాచే ఇప్పించుకో
2. మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై
మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై
మాలోన దివ్యజ్యోతి మసకేసి పోతున్నది
ఆహంకారం మనరించి మమకారం తొలగించి
చేయూత ఇచ్చి మమ్ము చేరతసుకో
నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మ్రొక్కులు
మాచే ఇప్పించుకో
ఓ తిరుపతి వేంకటేశ, ఓ శ్రీనివాసా
ఓ తిరుపతి వేంకటేశ, ఓ శ్రీనివాసా
నీవు ఇచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో