Parvati Song Lyrics in Telugu :-

పార్వతీ నాధా పరమేశ్వరా
దయచూడుము నిరతంబు జగదీశ్వరా
పార్వతీ నాధా పరమేశ్వరా
దయచూడుము నిరతంబు జగదీశ్వరా
1. పాహి మహేశ శివశంకరా
నా పాపము లన్నియు భరింపరా
చంద్ర శేఖరా నన్ను బ్రోవుమయా
చేరి నిన్ను నే పూజింతు నయ్యా
పార్వతీ నాధా పరమేశ్వరా
దయచూడుము నిరతంబు జగదీశ్వరా
2. నీదు నామము మధురాతి మధురం
రాదు నాకిక జన్మంబ ఇలలో
స్వర్గ సుఖములు నా కొసుగు మయ్యా
చేరి కొలుతును దయచూడుమయ్యా
పార్వతీ నాధా పరమేశ్వరా
దయచూడుము నిరతంబు జగదీశ్వరా
3. కావు మానను కాశీ పురవాసా
కరుణ చూడుము శ్రీ పార్వతీశా
పాపనాశన పాహి మహీశా
ఈశా పరమేశా – గౌరి పతీశా
పార్వతీ నాధా పరమేశ్వరా
దయచూడుము నిరతంబు జగదీశ్వరా