Pidikiti Talambrala Song Lyrics in Telugu :-
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వేనె పెండ్లి కూతురు
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వేనె పెండ్లి కూతురు
1. పేరుకల జవరాలె పెండ్లి కూతురు; పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరుకుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురు
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వేనె పెండ్లి కూతురు
2. బిరుదు పెండెము పెండ్లి కూతురు
బిరుదు మగని కంటె పెండ్లి కూతురు
పిరుదూరి నప్పుడె పెండ్లి కూతురు
బెరరెచి నిదివో పెండ్లి కూతురు
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వేనె పెండ్లి కూతురు
3. పెట్టేనే పెద్ద తురుము పెండ్లి కూతురు
పెట్టెడు చీరలు గట్టె పెండ్లి కూతురు
గట్టిగ వేంకట పతి కౌగిటను; వడి
వెట్టిన నిదానమైన పెండి కూతురు
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వేనె పెండ్లి కూతురు