Raja Rajeswari Song Lyrics in Telugu :-

రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి
రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి
1. చూడగ నీరూపము వీడ గత జన్మల పాపం
నీపేరు పలికిన చాలు సమకూరు వరమున వేలు
రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి
2. మనస్సు నీ ధ్యానముకై తనువు నీ సేవలకే
శరణంబు నీ చరణు కరుణించ రావమ్మా
రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి
3. నీగుడిలో దివ్వెను నేనై
పదియైన వెలిగెను చాలు
నీ పాదముల పైన పువ్వునై నిలిచిన చాలు
రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి