Rama Rama Song Lyrics | రామ రామ పాట – Rama Song

Rama Rama Song Lyrics in Telugu :-

Rama Rama Song Lyrics

రామ రామ మేఘశ్యామ – శ్రీ రామ రామ మేఘశ్యామ

రామ రామ మేఘశ్యామ – శ్రీ రామ రామ మేఘశ్యామ

1. నమ్మిన భక్తుల బ్రోచేవాడవు నీవే రామా
విశ్వామిత్రుని యోగము కాచి కీర్తిని పొందావు

రామ రామ మేఘశ్యామ – శ్రీ రామ రామ మేఘశ్యామ

2. అయోధ్య వాసులు ఎంతో పుణ్యము చేసినారు
ఆనందముగా నీ పాలనలో పోయిని పొందారు

రామ రామ మేఘశ్యామ – శ్రీ రామ రామ మేఘశ్యామ

3. మహార్షులంతా నిస్తోత్రమును ఆర్తిగ చేశారు
హనుమంతుడు నీ తారక నామము మదిలో నిలిపాడు

రామ రామ మేఘశ్యామ – శ్రీ రామ రామ మేఘశ్యామ

4. భద్రగిరిపై సీతారాములు స్థిరముగ వెలిశారు
వేదాంత వేద్యా శ్రీరామ దాసుడు ముక్తిని పొందాడు

రామ రామ మేఘశ్యామ – శ్రీ రామ రామ మేఘశ్యామ

Leave a Comment