Ramude Song Lyrics in Telugu :-

రాముడే నాదైవము – భద్రాచల రాముడే నాదైవము
రాముడే నాదైవము – భద్రాచల రాముడే నాదైవము
1. రామ నామమే – నాగానము
రామ నామమే – నాధ్యానము
రామ నామమే – నా ప్రాణము
రామ నామమే – నా జీవనము
పరమ శివుడు ఆపార్వతీ దేవితో
ప్రభోదించిన పావన నామము
పరమ యోగుల హృదయ కమలముల
ప్రతిధ్వనించిన ప్రణవ నామము
రాముడే నాదైవము – భద్రాచల రాముడే నాదైవము
2. రామ నామమే – గోరాగ హరణము
రామ నామమే – భవజలధి తరుణము
రామ నామమే – వాల్మికీ స్మరణం
రామ నామమే – శబరికి శరణం
అండ పిండ బ్రహ్మాండ మంతట నిండి యున్నట్టి
అఖండ నామము
దండ పాణి కోదండ పాణి, కోదండ పాణి
ఉద్దండ నామము
రాముడే నాదైవము – భద్రాచల రాముడే నాదైవము
రాముడే నాదైవము
రాముడే
రాయుడే