Ravamma Song Lyrics in Telugu:-
రావమ్మా మాయింటికి, అమ్మ రాజేశ్వరీ, అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మావూరికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి

1. నువ్వు స్నాన మాడ కృష్ణవేణి తీరమున్నది
నువ్వు కట్టుకోన కంచి పట్టు చీరలున్నవి
ఆపైన మందార పూవ్వులున్నవి, నీ పూజ కోస మే వేచి ఉన్నవి
రావమ్మా మాయింటికి, అమ్మ రాజేశ్వరీ, అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మావూరికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి
2. ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా, మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా
బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మా, శ్రీ శైల భ్రమరాంబ నీవేనమ్మా
రావమ్మా మాయింటికి, అమ్మ రాజేశ్వరీ, అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మావూరికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి
3. మల్లె పూల మాలలే తెచ్చినావమ్మా, నీకు సన్నజాజి పూవులే తెచ్చినావమ్మా
గులాబి పూవ్వులు తెచ్చినామమ్మా, నీ పూజ కోసమే వేసినామమ్ము
పెనుమాక కనక దుర్గ పరమేశ్వరీ నీవేనమ్మా
రావమ్మా మాయింటికి, అమ్మ రాజేశ్వరీ, అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మావూరికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి
4. రాజా రాజా రాజా రాజా రాజేశ్వరీ, విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ
రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరీ, విజయవాడ కనకదుర్గ పరమేశ్వరీ
రావమ్మా మాయింటికి, అమ్మ రాజేశ్వరీ, అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మావూరికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి
అమ్మ రాజేశ్వరీ, అమ్మ పరమేశ్వరీ
అమ్మ పరమేశ్వరీ, అమ్మ రాజేశ్వరీ