Sri Sai Nakshatra Malika | శ్రీ సాయి నక్షత్ర మాలిక లిరిక్స్

Sri Sai Nakshatra Malika in Telugu :-

శ్రీ సాయి నక్షత్ర మాలిక

1. షిరిడీసదనా శ్రీసాయీ సుందర వదనా శుభదాయీ జగత్కారణా జయసాయీ నీస్మరణే ఎంతో హాయీ.

2. శిరమున వస్త్రము చుట్టితివీ చినిగిన కఫనీ తొడిగితివీ పకీరువలె కనిపించితివీ పరమాత్ముడవనిపించితివీ.

3. చాందుపటేలుని పిలిచితివీ అశ్వము జాడ తెలిపితివీ మహల్సాభక్తికి మురిసితివీ సాయని పిలిచితే పలికితివీ.

4. గోధుమ పిండిని విసరితివీ కలరా వ్యాధిని తరిమితివీ తుపాను తాకిడి నాపితివీ అపాయమును తప్పించితివీ.

5. అయిదిళ్ళలొ భిక్షడిగితివీ పాపాలను పరిమార్చితివీ బైజా సేవను మెచ్చితివీ సాయుజ్యమునూ ఇచ్చితివీ.

6. నీళ్ళను నూనెగ మార్చితివీ దీపాలను వెలిగించితివీ సూకర నైజం తెలిపితివీ నిందలు వేయుట మాన్పితివీ.

7. ఊదీ వైద్యము చేసితివీ వ్యాధులనెన్నోబాపితివీ సంకీర్తన చేయించితివీ చిత్తశాంతి చేకూర్చితివీ.

8. అల్లా నామము పలికితివీ ఎల్లరి క్షేమము కోరితివీ చందనోత్సవము చేసితివీ మతద్వేషాలను మాపితివీ.

9. కుష్ఠురోగినీ గాంచితివీ ఆశ్రయమిచ్చీ సాకితివీ మానవధర్మం నెరపితివీ మహాత్మునిగా విలసిల్లితివీ.

10. ధునిలో చేతిని పెట్టితివీ కమ్మరి బిడ్డను కాచితివీ శ్యామా మొర నాలించితివీ పాము విషము తొలగించితివీ.

11. జానెడు బల్లను ఎక్కితివీ చిత్రముగా శయనించితివీ బల్లి రాకనూ తెలిపితివీ సర్వజ్ఞుడవనిపించితివీ.

12. లెండీ వనమును పెంచితివీ ఆహ్లాదమునూ పంచితివీ కర్తవ్యము నెరిగించితివీ సోమరితనమును తరిమితివీ.

13. కుక్కను కొడితే నొచ్చితివీ నీపై దెబ్బలు చూపితివీ ప్రేమ తత్వమును చాటితివీ దయామయుడవనిపించితివీ.

14. అందరిలోనూ ఒదిగితివీ ఆకాశానికి ఎదిగితివీ దుష్టజనాళిని మార్చితివీ శిష్టకోటిలో చేర్చితివీ.

15. మహల్సా ఒడిలో కొరిగితిప ప్రాణాలను విడనాడితివీ మూడు దినములకు లేచితివీ మృత్యుంజయుడనిపించితివీ.

16. కాళ్ళకు గజ్జెలు కట్టితివీ లయ బద్ధముగా ఆడితివీ మధుర గళముతో పాడితివీ మహదానందము కూర్చితివీ.

17. అహంకారమును తెగడితివీ నానావళినీ పొగడితివీ మానవసేవా చేసితివీ మహనీయుడవనిపించితివీ.

18. దామూ భక్తిని మెచ్చితివీ సంతానమునూ ఇచ్చితివీ దాసగణుని కరుణించితివీ గంగా యమునలు చూపితివీ.

19. పరిప్రశ్నను వివరించితివీ నానాహృది కదిలించితివీ దీక్షితుని పరీక్షించితివీ గురుభక్తిని ఇల చాటితివీ.

20. చేతిని తెడ్డుగ త్రిప్పితివీ కమ్మని వంటలు చేసితివీ ఆర్తజనాళిని పిలిచితివీ ఆకలి బాధను తీర్చితివీ.

21. మతమును మార్చితే కసరితివీ మతమే తండ్రని తెలిపితివీ సకల భూతదయ చూపితివీ సాయి మాతగా అలరితివీ.

22. హేమాదును దీవించితివీ నీదు చరిత వ్రాయించితివీ పారాయణ చేయించితివీ పరితాపము నెడబాపితివీ.

23. లక్ష్మీబాయిని పిలిచితివీ తొమ్మిది నాణెములిచ్చితివీ నవవిధ భక్తిని తెలిపితివీ ముక్తికి మార్గము చూపితివీ.

24. బూటీ కలలో కొచ్చితివీ ఆలయమును కట్టించితివీ తాత్యా ప్రాణము నిలిపితివీ మహా సమాధీ చెందితివీ.

25. సమాధి నుండే పలికితివీ హారతినిమ్మని అడిగితివీ మురళీధరునిగ నిలిచితివీ కరుణామృతమును చిలికితివీ.

26. చెప్పినదేదో చేసితివీ చేసినదేదో చెప్పితివీ దాసకోటి మది దోచితివీ దశదిశలా భాసిల్లితివీ.

27. సకల దేవతలు నీవెనయా సకలశుభములనుకూర్చుమయా సతతమునిను ధ్యానింతుమయా సద్గురుమాహృదినిలువుమయా.

సాయీ నక్షత్రమాలికా భవరోగాలకు మూలికా పారాయణ కిది తేలికా
ఫలమిచ్చుటలో ఏలికా

సాయిరామ, సాయిరామ, రామరామ, సాయిరామ
సాయికృష్ణ, సాయికృష్ణ, కృష్ణ, కృష్ణ, సాయికృష్ణ

Leave a Comment