Sai Tatvamu Song Lyrics :-
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
1. చేదవేసి తోడితే యిలకడలి నీరు తరుగునా
చిత్తశుద్ధీ లేని పూజను సాయి స్వీకరించునా
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
2. జల్లెడడ్డము పెట్టితే యిల పెనుతుపాను ఆగునా
భక్తిలేనీ భజననూ శ్రీ సాయినాథుడు మెచ్చునా
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
3. వేయిసారులు సచ్చరిత్రను పారాయణ చేసినా
సాయి మనసు గ్రహించకుంటే సద్గతీ ప్రాప్తించునా
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
4. పూటపూటకు మహామంత్రము కోటిసార్లు జపించినా
సాటివారికి సాయపడనిదె సాయి సంతోషించునా
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
5. అర్ధమవ్వని భాష వింటే ఆత్మతృప్తి కలుగునా
స్వార్ధబుద్ధితో పిలిచితే శ్రీ సాయినాథుడు పలుకునా
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
6. పుట్టుగ్రుడ్డికి లాంతరిస్తే అంధకారము తొలగునా
సత్ప్రవర్తన లేనిదే శ్రీ సాయి మిము దరి చేర్చునా
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
7. ధర్మమును రక్షించితే మిము ధర్మమే రక్షించునూ
మర్మముతో జీవించితే మిము మర్మమే శిక్షించునూ
సాయి తత్వము తెలిసి మెలగండీ సద్భక్తులారా
సాయి కృపకూ పాత్రులవ్వండీ ….
సాయిరామ, సాయిరామ, రామ, రామ, సాయిరామ
సాయికృష్ణ, సాయికృష్ణ, కృష్ణ, కృష్ణ, సాయికృష్ణ