Saipadalakide Song Lyrics :-
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
1. జగములనేలే సాయికి జాజిపూల పూజ
అఘములు బాపే సాయికి అక్షతల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
2. భక్తకోటి విభునకిదే బంతిపూల పూజ
సిరిగల శ్రీసాయికిదే చేమంతుల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
3. కామితఫలదాయికిదే కమలపుష్ప పూజ
మంగళ శుభదాయికిదే మల్లెపూల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
4. లీలలు చేసే సాయికి లిల్లీపూల పూజ
దీవెనలిచ్చే సాయికి గన్నేరుల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
5. కరుణగల సాయికి కనకాంబరాల పూజ
కలిమిగల సాయికిదే కలువపూల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
6. సంకీర్తన ప్రియునకిదే సంపెంగెల పూజ
దీనార్తి హరునకిదే దీపాల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
7. శ్రీరంగ సాయికిదే తులసీదళముల పూజ
బంగారు సాయికిదే బహువిధ పుష్పాల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
8. గుడిలోని సాయికిదే గులాబీల పూజ
మనలోని సాయికిదే మానస పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ
మనసెరిగిన సాయికిదే మందారాల పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ సాయిపాదాలకిదే చక్కని పూజ
సాయిపాదాలకిదే చక్కని పూజ సాయిపాదాలకిదే చక్కని పూజ