Sarvajanaliki Song Lyrics | సర్వజనాళికి సాయి పాట – Sai Song

Sarvajanaliki Song Lyrics :-

Sarvajanaliki Song Lyrics

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

1. జ్ఞానవంతులని మూఢమతులనీ భేదమేమియూ లేదండీ
సాయి చరితమును శ్రవణము చేసి సకల శుభములను పొందండీ

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

2. కోకిల స్వరమని గార్దభ స్వరమని భేదమేమియూ లేదండీ
సాయి గుణములను కీర్తన చేసి సకల శుభములను పొందండి

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

3. ఏకాదశియని అమావాస్యయని భేదమేమియు లేదండీ
సతతము సాయిని స్మరణము చేసి సకల శుభములను పొందండీ

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

4. భాగ్యవంతులని నిరుపేదలనీ భేదమేమియు లేదండీ
సాయిగురు పాదసేవనము చేసి సకల శుభములను పొందండీ

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

5. తగిన వయసనీ తగని వయసనీ భేదమేమియూ లేదండీ
భక్తితో సాయికి అర్చన చేసి సకల శుభములను పొందండి

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

6. హిందూ మతమని ముస్లింమతమని భేదమేమియూ లేదండీ
భక్తితొ సాయికి నమస్కరించి సకల శుభములను పొందండీ

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

7. అయినవారనీ కానివారనీ భేదమేమియూ లేదండీ
సద్గురు సాయికి దాస్యము చేసి సకల శుభములను పొందండీ

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

8. ఎక్కువ కులమని తక్కువకులమని భేదమేమియూ లేదండీ
సాయినాథునితొ సఖ్యము చేసి సకల శుభములను పొందండి

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

9. ఆడవారనీ మగవారలనీ భేదమేమియు లేదండీ
సాయికి ఆత్మనివేదన చేసి సకల శుభములను పొందండి

సర్వజనాళికి సాయి తెలిపిన నవ విధ భక్తులివేనండీ
చక్కగ వాటిని ఆచరించి సకల శుభములను పొందండి

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

Leave a Comment