Seva Chese Song Lyrics | సేవ చేసే పాట – Hanuman Song

Seva Chese Song Lyrics in Telugu :-

Seva Chese Song Lyrics

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ
సేవ చేసే భాగ్యమడిగితిని
సేవ కన్నా మిన్న యైనది ఏది లేదని తెలిపినా
నీ సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ
సేవ చేసే భాగ్యమడిగితిని

1. సేవ చేసి నంది పొందెను శివ సమేప వాసము
సేవ చేసి పక్షి పొందెను స్థిరవైకుంఠ నివాసము
సేవ చేసిన నీకు కలుగును దైవత్వము
జీవ భారము మరచిపోయి చిరంజీవి వైతివా

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ
సేవ చేసే భాగ్యమడిగితిని

2. సేవ వలన నాకు కలుగును పావన మగు నీదు కరుణ
సేవ చేసి ధన్యమొంది చిగురు వేయును నాదు జన్మ
సేవ చేసి బొందిలోని శ్రీరాముని నిలుపుకొన్నా
నీ సేవ చేత లభ్యమగును చిన్మయా నంద సేవా

సేవ చేసే భాగ్యమడిగితిని శ్రీమారుతీ
సేవ చేసే భాగ్యమడిగితిని

Leave a Comment