Shiva Song Lyrics in Telugu :-

శివ శంభో హర హర దూమొరలే వినరావా
మా ప్రార్ధన విని మన్నింతువని నీ భజనలు చేతుమయా
శివ శంభో హర హర దూమొరలే వినరావా
మా ప్రార్ధన విని మన్నింతువని నీ భజనలు చేతుమయా
1. కైలాసమే నీ వాసముగా – కాశీపురమున వెలసితివా
కోరిక తీర్చరా భీమ లింగేశ్వరా
కోరిక తీర్చరా భీమ లింగేశ్వరా
కోరితారా దేవా – మా మొరలే వినరావా
శివ శంభో హర హర దూమొరలే వినరావా
మా ప్రార్ధన విని మన్నింతువని నీ భజనలు చేతుమయా
2. లింగరూపము నవయ్యా – భుజంగ భూషణ రావయ్యా
కనక జటా ధరా – ధవళ శరీరా
కనక జటా ధరా – ధవళ శరీరా
కావగ రావయ్యా – కాపాడగ రావయ్యా
శివ శంభో హర హర దూమొరలే వినరావా
మా ప్రార్ధన విని మన్నింతువని నీ భజనలు చేతుమయా
3. గళమున గరళము దాల్చితివి – గంగను శిగపై ఉంచితివి
పార్వతీ నాధా – పరుగున రావా
పార్వతీ నాధా – పరుగున రావా
పాహి పరమేశా శ్రీశైల మల్లేశా శ్రీశైల మల్లేశా
శివ శంభో హర హర దూమొరలే వినరావా
మా ప్రార్ధన విని మన్నింతువని నీ భజనలు చేతుమయా