Sri Lalitha Chalisa | శ్రీ లలిత చాలీసా

Sri Lalitha Chalisa in Telugu & English :-

తెలుగు లో లలిత చాలీసా:-

1. లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం.

2. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని,
ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం.

3. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంస
వాహనా రూఢిణిగా వేద మాతవై వచ్చితివి.

4. శ్వేత వస్త్రము ధరియించి అక్షర మాలను పట్టుకొని భక్తి
మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి.

5. నిత్య అన్నదానేశ్వరిగా కాశీ పురమున కొలువుండ ఆది
భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు.

6. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షి వైనావు.

7. శ్రీ చక్రరాజనిలయనిగా శ్రీమద్ త్రిపుర సుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా.

8. మణి ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి.

(లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం.)

9. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపుధారణలో
పారిజాతపు మాలలలో పార్వతీదేవిగ వచ్చితివి.

10. రక్తవస్త్రము ధరియించి రణ రంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్య కపర్ధిని వైనావు.

11. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి
కలియుగ మంతాకాపాడ కనకదుర్గవై వెలసితివి.

12. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా
రమావాణీ సేవితగా రాజరాజేశ్వరి వైనావు.

13. ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని
శుంభనిశుంభుల దునుమాడి వచ్చిందీ శ్రీ శ్యామలగా.

14. మహా మంత్రాధి దేవతగా లలితా త్రిపుర సుందరిగా
దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే.

15. ఆర్తత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆది
శంకర పూజితవే అపర్ణాదేవి! రావమ్మా.

16. విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భగీరధుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి.

(లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం.)

17. అశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శన మిచ్చెను జగదంబ.

18. దక్షుని యింట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ.

19. శంఖు చక్రము ధరియించి రాక్షస సంహారము చేసి
లోక రక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు.

20. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరియించితివి.

21. పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర, పరమేశ్వరితో
ప్రమధ గణములు కొలువుండ కైలాసంబే పులకించే.

22. సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి.

23. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లును శ్రీ జగదంబ.

24. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణిగా రూపొంది
శంఖ నాదము చేసితివి సింహవాహినిగ వచ్చితివి.

25. మహా మేరువు నిలయనివి మందార కుసుమ మాలలతో
మునులందరు నిను కొలువంగా మోక్షమార్గము చూపితివి.

26. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే.

27. అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం.

28. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞాన ప్రసూనా రావమ్మా జ్ఞానము నందరి కివ్వమ్మా.

29. నిష్ఠతో నిన్నే కొలచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు.

30. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి.

31. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
అసురుల నందరనుదునుమాడి అపరాజితవై వచ్చితివి.

32. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి.

(లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం.)

33. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి.

34. కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశన మియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా.

35. ఏ విధముగ నిను కొలిచినను ఏ పేరున నిను పిలచినను
మాతృ హృదయవై దయచూపు కరుణా మూర్తిగ కాపాడు.

36. మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి
మగువల మంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి.

37. త్రిమాతృరూపా లలితమ్మా సృష్టిస్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా.

38. ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మదీవెన పొందుదము.

39. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియ లోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్య మిచ్చే దేవతవు.

40. మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము.

(లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం.)

Sri Lalitha Chalisa in English:-

1. Lalitamata sambhupriya jagatiki mulam nivamma
Sri bhuvanesvari avataram jagamantatiki adharam.

2. Herambuniki matavuga hariharadulu sevimpa
canduni
Munduni samharam camundesvari avataram.

3. Padmarekula kantulalo balatripurasundariga
hamsa
Vahana rudhiniga vedamatavai vaccitivi.

4. Svetavastramu dhariyinci aksaramalanu pattukoni
bhakti
Margamu cupitivi jnanajyotini nimpitivi.

5. Nitya annadanesvariga kasipuramuna koluvunda
Adi Biksuvai vaccadu saksadaparamesvarudu.

6. Kadambavana sancariniga kamesvaruni kalatramuga
Kamitartha pradayiniga kanci kamaksivainavu.

7. Sri cakraraja nilayiniga srimat tripurasundariga
Siri sampadalu ivvamma srimahalaksmiga ravamma.

8. Mani dvipamuna koluvundi mahakali avataramulo
Mahisasuruni campitivi mullokalanu elitivi.

(Lalitamata sambhupriya jagatiki mulam nivamma
Sri bhuvanesvari avataram jagamantatiki adharam)

9. Pasidi vennela kantulalo pattuvastrapudharanalo
Parijata pumalalo parvati deviga vaccitivi.

10. Raktavastramu dhariyinci ranarangamuna pravesinci
Raktabijuni hatamarci ramyakapardinivainavu.

11. Kartikeyuniki matavuga katyayiniga karuninci
Kaliyugamanta kapada kanakadurgavai velisitivi.

12. Ramalingesvaru raniviga ravikula somuni ramaniviga
Ramavani sevitaga rajarajesvarivainavu.

13. Khadgam sulam dhariyinci pasupatastram cebuni
Sumbha nisumbhula dunumadi vaccindi srisyamalaga.

14. Maha mantradhidevataga lalitatripurasundariga
Daridrya badhalu toliginci mahadanandamu kaligince.

15. Artatrana parayanive advaitamrta varsinive
Adi Sankara pujitave aparnadevi ravamma.

16. Visnu padamuna janiyinci gangavataramu ettitivi
Bhagirathudu ninu koluva bhulokaniki vaccitivi.

(Lalitamata sambhupriya jagatiki mulam nivamma
Sri bhuvanesvari avataram jagamantatiki adharam)

17. Asutosuni meppinci ardhasariram dalcitivi
Adi prakrti rupiniga darsanamiccenu jagadamba.

18. Daksuni inta janiyinci satideviga calinci
Astadasa pithesvariga darsanamiccenu jagadamba .

19. Sankhu cakramunu dhariyinci raksasa samharamunu cesi
Loka raksana cesavu bhaktula madilo nilicavu.

20. Parabhattarika devataga paramasanta svarupiniga
Chirunavvulanu cindistu ceraku gadanu dharayincitivi.

21. Pancadasaksari mantradhitaga paramesvara paramesvarito
Pramathaganamulu koluvunda kailasambe pulakince.

22. Surulu asurulu andarunu sirasunu vanci mrokkanga
Manikyala kantulato ni padamulu merisinavi.

23. Muladhara cakramulo yoginulaku adisvariyai
Ankusayudha dhariniga bhasillenu sri jagadamba.

24. Sarvadevatala saktulace satya svarupini rupondi
Sankha nadamu cesitivi simhavahiniga vaccitivi.

(Lalitamata sambhupriya jagatiki mulam nivamma
Sri bhuvanesvari avataram jagamantatiki adharam)

25. Mahameruvu nilayanivi mandara kusumamalalato
Munulandaru ninu kolavanga moksamargamu cupitivi.

26. Chidambaresvari nilila cidvilasame ni srsti
Chidrupi paradevataga cirunavvulanu cindince.

27. Amba sambhavi avataram amrtapanam ni namam
Adbhutamainadi ni mahima atisundaramu ni rupam.

28. Ammalaganna ammavuga muggurammalaku mulamuga
Janana prasuna ravamma janana munandari kivvamma.

29. Nistato ninne kolicedamu ni pujalane cesedamu
Kastamulanni kadaterci kanikaramuto mamu kapadu.

30. Raksasa badhalu padaleka devatalanta prarthimpa
Abhayahastamu cupitivi avataramulu dalcitivi.

31. Arunarunapu kantulalo agni varnapu jvalalalo
Asurula nandari dunumadi aparajitavai vaccitivi.

32. Girirajuniki putrikaga nandananduni sodariga
Bhulokaniki vaccitivi bhaktula korkelu tircitivi.

(Lalitamata sambhupriya jagatiki mulam nivamma
Sri bhuvanesvari avataram jagamantatiki adharam)

33. Paramesvaruniki priyasatiga jagamantatiki matavuga
Andari sevalu andukoni antata nive ninditivi.

34. Karunincamma lalitamma kapadamma durgamma
Darisana miyyaga ravamma bhaktula kastam tircamma.

35. E vidhamuga ninu kolicinanu e peruna ninu pilicinanu
Matru hrudayavai dayacupu karunamurtiga kapadu.

36. Mallelu mollalu teccitimi manasunu nike iccitimi
Maguvala manta ceritimi ni parayana cesitimi.

37. Trimatrrupa lalitamma srsti sthiti layakarinivi
Ni namamulu ennenno lekkincuta mama taramavuna.

38. Asritulandaru rarandi ammarupamu cudandi
Ammaku nirajanamicci amma divena pondudamu.

39. Sadacara sampannavuga samagana priyalolinivi
Sadasiva kutumbinivi saubhagyamicce devatavu.

40. Mangalagauri rupamunu manasula ninda nimpandi
Mahadeviki manamanta mangala haratuliddamu.

(Lalitamata sambhupriya jagatiki mulam nivamma
Sri bhuvanesvari avataram jagamantatiki adharam)

Leave a Comment