Sri Satyanarayanuni Song Lyrics in Telugu :-
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
1. నోచిన వారికి నోచిన ఫలము
చూసిన వారికి చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
2. స్వామిని పూజించే చేతులే చేతులట
అమూర్తిని ధర్మించే కనులె కన్నులట
అమూర్తిని ధర్మించే కనులె కన్నులట
తన కథ వింటే ఎవ్వరికైనా జన్మతరించునట
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
3. ఏ వేళైన ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
4. అర్ధన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
5. మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా
కరములు జోడించి శ్రీ చందన మలరించి
కరములు జోడించి శ్రీ చందన మలరించి
మంగళ మనరే సుందర మూర్తికి వందన మనరమ్మా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా