SriAnjaneya Song Lyrics in Telugu :-
శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…
ఓ జనులుపాడేరు జయము కోరెరు
1. ఒడి బడి పోయే వనదిని దాటి వనితను చేరేవు
లంకకు పోయి లంకిణి కూల్చి రంకెలు వేశేవు
హనుమా నీకోపం అరసేను పాపం
శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…
ఓ జనులుపాడేరు జయము కోరెరు
2. బంధాలన్నీ బంది చేసే బలమే నీదోయి
బాసుర మౌని భజనలు చేయ మంత్రము నీదోయి
బలమే నీనాయం బరువయిన బాణం
శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…
ఓ జనులుపాడేరు జయము కోరెరు
3. మానస మందున జానకి రాములు మంచిగ నిలచేరు
చక్కని వాడా తిరుమలలోన అల్లుకు పోయేవు
కరుణాల వాల మము బ్రోవ దేరా
శ్రీ ఆంజనేయా సంజీవరాయ దీవించరా చల్లగా…
ఓ జనులుపాడేరు జయము కోరెరు