Vellalanukunna Song Lyrics :-

వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము షిరిడీకీ
సాయి దయలేనిదే సాయిపిలుపు రానిదే
వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము షిరిడీకీ
సాయి దయలేనిదే సాయిపిలుపు రానిదే
1. ఉద్యోగమున్ననూ ఉత్సాహమున్ననూ
సెలవులు ఉన్ననూ సేవకులు ఉన్ననూ
సాయి దయ లేకుంటే సాగదండి ప్రయాణం
వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము షిరిడీకీ
సాయి దయలేనిదే సాయిపిలుపు రానిదే
2. ఆరోగ్యమున్ననూ ఐశ్వర్యమున్ననూ
ఆప్తులు వున్ననూ అవకాశమున్ననూ
సాయిదయ లేకుంటే సాగదండి ప్రయాణం
వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము షిరిడీకీ
సాయి దయలేనిదే సాయిపిలుపు రానిదే
3. పిచ్చుక కాళ్ళకూ తాడుగట్టి లాగినటుల
తన భక్త కోటినీ సాయి రప్పించు కొనును
పరహితవుకోరండి సాయిదయను పొందండీ
వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము షిరిడీకీ
సాయి దయలేనిదే సాయిపిలుపు రానిదే
సాయిరంగ విఠలా సద్గురునాధ విఠలా
పాండురంగ విఠలా పండరినాధ విఠలా
సారంగ విఠలా సద్గురునాధ విఠలా
పాండురంగ విఠలా పండరినాధ విఠలా