Vinnava Song Lyrics in Telugu :-
విన్నావా – నామొర విన్నావా ఓరాజ రాజేశ్వరీ
నిన్ను పూజింతుమే నిను సేవింతుమే
మామొరలకించ వమ్మా
విన్నావా – నామొర విన్నావా ఓరాజ రాజేశ్వరీ
నిన్ను పూజింతుమే నిను సేవింతుమే
మామొరలకించ వమ్మా
1. పాపాత్ములము మమ్ము కాపాడవమ్మా
అలుకేల మా మీద జగదీశ్వరి
దయలేదా మా మీద దామోదరీ
మము కరుణించ రావేల భ్రమరాంబికా
విన్నావా – నామొర విన్నావా ఓరాజ రాజేశ్వరీ
నిన్ను పూజింతుమే నిను సేవింతుమే
మామొరలకించ వమ్మా
2. కలియుగ మందునైనా నీనామ భజన
మేమిప్పుడు మరువాము కాత్యాయని
ఏమి పాపములు చేసితిమి
ఆపాపములు తెగనరకి వేయువమ్మా
విన్నావా – నామొర విన్నావా ఓరాజ రాజేశ్వరీ
నిన్ను పూజింతుమే నిను సేవింతుమే
మామొరలకించ వమ్మా
3. నమ్మితి మమ్మా నీనామ స్మరణ
మదిలోన మేమెపుడు ధ్యానింతుమే
యీ దాస దాసులను బ్రోవవమ్మా
ఈ బిడ్డలను రక్షింప రావే లమ్మా
విన్నావా – నామొర విన్నావా ఓరాజ రాజేశ్వరీ
నిన్ను పూజింతుమే నిను సేవింతుమే
మామొరలకించ వమ్మా