Yashodhamma Song Lyrics in Telugu :-

యశోదమ్మ తల్లి ఏలగంటి వమ్మా
ఇంత గడుసు వాడు నీ వాడు
మావాడు కాదమ్మా మరి ఎవ్వరో గాని
మా కృష్ణ మా వద్ద వున్నాడు
1. గుడిలోన దేవుడిని పొంగళ్లు చేస్తుంటే
అవి అన్ని తినివచ్చే మీవాడు
మా వాడు కాదమ్మా మరి ఎవ్వరో కాని
మా కృష్ణ మా వద్ద వున్నాడు
2. గుడిలోన దేవుడికి దీపాలు వెలిగిస్తే
ట్రాఫ్ అని ఊదెచ్చె మీ వాడు
మా వాడు కాదమ్మా మరి ఎవ్వరో కాని
మా కృష్ణ మా వద్ద ఉన్నాడు
3. సాలీలు మగ్గాన చీరలు నేస్తుండే
అవి అన్నీ తెంచొచ్చె మీ వాడు
మా వాడు కాదమ్మా మరి ఎవ్వరో కాని
మా కృష్ణ మా వద్ద వున్నాడు
4. గోపిక స్త్రీలంతా స్నానాలు చేస్తుంటే
చీరలు తెచ్చాడు మీ వాడు
మా వాడు కాదమ్మా మరి ఎవ్వరో కాని
మా కృష్ణ మా వద్ద వున్నాడు