Ammakide Song Lyrics in Telugu :-
అమ్మకిదే పూజ, పాదపూజ
లలితమ్మకి పూజ పాదపూజ
1. మంచి మనసుతో చేసే మల్లెల పూజ
కలకాలం అమ్మకిదే కనకాంబర పూజ
చేయు వదల రాదని చేమంతుల పూజ
మహా మేరు నిలయునికి మందరాల పూజ
అమ్మకిదే పూజ, పాదపూజ
లలితమ్మకి పూజ పాదపూజ
2. గుడిలోను తలకిదే సలాబీల పూజ
సకల రూప దారిణికి సంపెంగ పూజ
మంగళ దాయునికిదే మాల తీల పూల
భక్తుల చే తల్లికి బంతి పూల పూజ
అమ్మకిదే పూజ, పాదపూజ
లలితమ్మకి పూజ పాదపూజ
3. లీలా వినోదినికి లిల్లీపూల పూజ
కనువిందుల చేసేటి కమలాల పూజ
దిగివచ్చిన మాతకిదే దీపాల పూజ
జాలిగల తల్లినిదే జాజుల పూజ
అమ్మకిదే పూజ, పాదపూజ
లలితమ్మకి పూజ పాదపూజ