O Kailasa Song Lyrics in Telugu :-

ఓ కైలాస హిమగిరి శంకరా
కనికరము ఉంచరా మనసారా మోము చూపించరా
ఓ కైలాస హిమగిరి శంకరా
కనికరము ఉంచరా మనసారా మోము చూపించరా
1. నీలకంఠ నిను చూడకోరి నిరతము నిను పూజించెదా
పాలనేత్ర ఓ పరమ పురుష పాహిమాం అని ప్రార్ధి౦చెద
స్వామి కనికరము ఉంచరా – మనసారా మోము చూపరా
ఓ కైలాస హిమగిరి శంకరా
కనికరము ఉంచరా మనసారా మోము చూపించరా
2. మనసు నిలిపిన మహానీయు లెందరో జన్మ సద్గతి సాధించిరీ
కనరానీ కరీ మాయ లోనా కారడవులలో పడిపోతామి
స్వామి కనికరము ఉంచరా – మనసారా మోము చూపరా
ఓ కైలాస హిమగిరి శంకరా
కనికరము ఉంచరా మనసారా మోము చూపించరా
3. చంద్రమౌళి చిత భస్మదారి చంద్రకిరణా జ్యోతులివిగో
దండమోయు ఓ లింగదారి నిండుగొలిపే చర్మాంబరా
స్వామి కనికరము ఉంచరా – మనసారా మోము చూపరా
ఓ కైలాస హిమగిరి శంకరా
కనికరము ఉంచరా మనసారా మోము చూపించరా