Parimalam Song Lyrics in Telugu :-
ఎక్కడి పరిమళం ఇది ఎక్కడి పరిమళం
అమ్మవారి సన్నిధిలో దివ్యపరిమళం
ఎక్కడి పరిమళం ఇది ఎక్కడి పరిమళం
అమ్మవారి సన్నిధిలో దివ్యపరిమళం
1. ఎర్ర ఎర్రని మాలలే వేసినాము
నలుబది దినములు దీక్షలు చేసినాము
ఇరుముడిని తలపిన దాల్చినాము
శరణం శరణం అంటూ వేడినాము
ఎక్కడి పరిమళం ఇది ఎక్కడి పరిమళం
అమ్మవారి సన్నిధిలో దివ్యపరిమళం
2. కృష్ణా నదిలో స్నానమే చేసినాము
మా అమ్మ దుర్గమ్మను చూసినాము
మనసార తల్లినే వేడినాము
తల్లిపాద చెంతనిండే కమ్మని పరిమళం
ఎక్కడి పరిమళం ఇది ఎక్కడి పరిమళం
అమ్మవారి సన్నిధిలో దివ్యపరిమళం