Sri Lakshmi Song Lyrics in Telugu :-

శ్రీలక్ష్మీ దేవి మా పూజలు గైకొనుమా
శ్రీలక్ష్మీ దేవి మా పూజలు గైకొనుమా
1. పుష్పములోన నీవు జన్మించిలి వోయమ్మా
గలగల లాడే నీకాళ్ల గజ్జెలు మ్రోగంగా
నీ కరుణ మాకొసగి దరశన మీయమ్మా
శ్రీలక్ష్మీ దేవి మా పూజలు గైకొనుమా
2. ఆదిలక్ష్మిగా నీవు అలరారు చుంటివమ్మా
ఈ దీనుల బ్రోవంగా వివేగమే రావమ్మా
పరిపాల స్త్రీ లోల ఇదియె నీలీల
శ్రీలక్ష్మీ దేవి మా పూజలు గైకొనుమా
3. క్షీర సాగర మందున – ఆశేష తల్పమున
శ్రీలక్ష్మి నారాయణుని – నీవు పాదములొత్తంగ
వరుసగను భక్తులకు దరిశన మీయమ్మా
శ్రీలక్ష్మీ దేవి మా పూజలు గైకొనుమా