Manidweepa Varnana Lyrics in Telugu & English :-
మహాసంపదలిచ్చు – మణిద్వీప వర్ణన
1. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది.
2. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబుగు మనో సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు.
3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు.
4. పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలౌ గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం.
5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు.
6. అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. ||భువ||
7. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు.
8. కోటి సూర్యులుప్రపంచకాంతులు కోటిచంద్రులచల్లనివెలుగులు కోటితారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు. ||భువ||
9. కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు.
10. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు.
11. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు పుష్యరాగమణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు.
12. సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. ||భువ||
13. మిలమిలలాడే ముత్యపురాశులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు
14. కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు
15. భక్తిజ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు.
16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. ||భువ||
17. మంత్రిణి దండిని శక్తిసేవలు కాళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు.
18. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు.
19. సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు.
20. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయాకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. ||భువ||
21. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు.
22. దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు.
23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు.
24. పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక శక్తులు సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. ||భువ||
1. Mahashakti manidweepa nivaasini mullokaalaku moola prakaashini
manidweepamulo mantraroopini mana manassulalo koluvaiyundi.
2. Sugandha parimala pushpaalenno velu ananta sundara suvarnapoolu
achanchalambagu manosukhaalu manidweepaniki mahanidhulu.
3. Lakshala laavanyaalu akshara lakshala vaak sampadalu
lakshala lakshmipatulu manidweepaniki mahanidhulu.
4. Paarijaata vana sauganthaalu suraadhinaadhula satpangaalu
gandharvaadula gaana svaraalu manidweepaniki mahanidhulu.
5. Bhuvaneshvari sankalpame janiyinche manidweepam
devadevula nivaasamu adiye kaivalyam.
6. Padmaraagamulu suvarnamanulu padiaamadala podavuna galavu
madhura madhuramagu chandana sudhalu manidweepaniki mahanidhulu.
7. Aruvadi naalugu kalaamataltulu varaalanosage padaarushaktulu
parivaaramuto panchabrahmalu manidvipaaniki mahaanidhulu.
8. Ashtasiddulu navanava nidhulu ashtadikkuloo dikpaalakulu
srushtikartalu suralokaalu manidweepaniki mahaanidhulu.
9. Koti sooryulu prachandakaantulu kotichandrula challani velugulu
koti taarakala velugu jilugulu manidweepaniki mahaanidhulu॥bhuva.
10. Kanchugodala praakaaraalu raagigodala chaturapraalu
edaamadala ratnaraasulu manidweepaniki mahaanidhulu.
11. Panchaamrutamaya sarovaraalu panchalohamaya praakaaraalu
prapanchamele prajaadhipatulu mani dtipaaniki mahaanidhulu.
12. Indranilamani aabharanaalu vajrapu kotalu vaidhooryaalu
pushyaraagamani praakaaraalu manidweepaniki mahaanidhulu.
13. Saptakoti ghana mantravidyalu sarvashubhaprada ichchaashaktulu
shrigaayatri jnaanashaktulu manidweepaniki mahaanidhulu. ||bhuva||
14. Milamilalaade mutyapuraasulu talatalalaade chandrakaantamulu
vidyullatalu marakatamanulu manidvipaaniki mahaanidhulu.
15. Kubera indra varunadevulu shubhaalanosage agnivaayuvulu
bhoomi ganapati parivaaramulu manidvipaaniki mahaanidhulu.
16. Bhaktijnaana vairaagyasiddulu panchabhootamulu panchashaktulu
sapta’rushulu navagrahalu manidvipaaniki mahaanidhulu.
17. Kastoori mallika kundavanaalu sooryakaanti shilamahaagrahaalu
aru rutuvulu chaturvedaalu manidvipaaniki mahaanidhula. ||bhuva||
18. Mantrini dandini shaktisevalu kaalikaraali senaapatulu
muppadi rendu mahaashaktulu manidvipaaniki mahaanidhulu.
19. Suvarnarajita sundaragirulu aanantadevi parichaarikalu
gomedhikamuni nirmita guhalu manidvipaaniki mahaanidhulu.
20. Saptasamudramu lananta nidhulu yakshakinnera kimpurushaadulu
naanaajagamulu nadinadamulu manidvipaaniki mahaanidhulu.
21. Maanava maadhava devaganamulu kaamadhenuvu kalpataruvulu.
srushtistitilaya kaaranamoortulu manidvipaaniki mahaanidhulu. ||bhava||
22. Koti prakrutula saundaryaalu sakalavedamulu upanishattulu
padaaru rekula padmashaktulu manidvipaaniki mahaanidhulu.
23. Divya phalamulu divyaa stramulu divya purushulu dhiramaatalu
divya jagamulu divyashaktulu manidvipaaniki mahaanidhulu.
24. Sri vighneshvara kumaarasvaamulu jnaanamukti ekaanta bhavanamulu
mani nirmitamagu mandapaalu manidvipaaniki mahaanidhulu.
25. Panchabhootamulu yaajamaanyaalu pravaalasaalam anekashaktulu
santaana vruksha samudaayaalu manidvipaaniki mahaanidhulu. ||bhava||
26. Chintaamanulu navaratnaalu nooraamadala vajrapuraasulu
vasantavanamulu garudapachchalu manidvipaaniki mahaanidhulu.
27. Duhkhamu teliyani devisenalu natanaatyaalu sangitaalu
dhanakanakaalu purushaardaalu manidvipaaniki mahaanidhulu.
28. Padunaalgu lokaalannitipaina sarvalokamanu lokamu galadu
sarvalokame e manidvipamu sarveshvarikadi shaashvatasdaanam.
29. Chintaamanula mandiramandu panchabrahmala manchamupaina
mahaadevudu bhuvaneshvarito nivasistaadu manidweepamulo. ||bhuva||
30. Manigana khachita abharanaalu chintaamani parameshvari daalchi
saundaryaaniki saundaryamugaa agupadutundi mani dvipamulo.
31. Paradevatanu nityamu kolichi manasarpinchi archinchinacho
apaaradhanamu sampadalichchi manidvipeshyari divistundi.
Paradevatanu nityamu kolichi manasarpinchi archinchinacho
apaaradhanamu sampadalichchi manidvipeshyari divistundi.
32. Nutana gruhamulu kattinavaaru manidweepa varnana tommidisaarlu
chadivina chaalu antaa shubhame ashtasampadala tulatoogeru.
Nutana gruhamulu kattinavaaru manidweepa varnana tommidisaarlu
chadivina chaalu antaa shubhame ashtasampadala tulatoogeru.
33. Shivakaviteshvari shri chakreshvari manidvipa varnana chadivinachota
tishta vesukoni koorchonunantaa koti shubhaalanu samakoorchakonutakai.
34. Bhuvaneshvari sankalpame janiyinchenu ee manidvipam chethne
devadevula nivaasamu adiye mana bhakthakoti kaivalyam.